చెత్త నుండి సంపద తయారీ కేంద్రం పరిశీలన
రణస్థలం,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 31
రణస్థలం మండలం కోటపాలెం గ్రామ పంచాయతీ లోఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ను శుక్రవారం డీ.ఎల్.పీ.ఓ, మరియు రణస్థలం మండల ప్రత్యేక అధికారి వారు ఐ.వి.రమణ మరియు రణస్థలం ఈఓపిఆర్డి వీ.ప్రకాష్
పరిశీలించారు. .గ్రామంలో వ్యర్ధాలను సేంద్రియ ఎరువుగా తయారు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం అంగన్వాడి సెంటర్ లో పెంచుతున్న కిచెన్ గార్డెన్
ను పరిశీలించారు. సేంద్రియ ఎరువులతో పండిస్తున్న కూరగాయలను విద్యార్థులకు ఆహారంగా అందించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వారి వెంట పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ ఎక్స్ సర్పంచ్ సుంకర ధనుంజయరావు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు .