ఇసుక అక్రమ తవ్వకాలు జరిగితే కేసులు
* వాహనాలు వెళ్లే దారిలో హెచ్చరిక బోర్డులు
ఇచ్ఛాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 31
బాహుదా నదిలో ఇసుక అక్రమ త్రవ్వకాలు జరిపితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎన్ వెంకటరావు హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్ట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నదికి వెళ్లే రహదారి మార్గంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది తెలిపారు. రెవెన్యూ పరంగా ఎప్పటికప్పుడు అక్రమదారులపై చర్యలు తీసుకున్నప్పటికీ ఇసుక అక్రమదారులు రాత్రి వేళలో తీసిన గుంతలు కప్పిమరి ఇసుక త్రవ్వకాలు జరుపుతున్నారు. పూర్తిగా ఇసుక అక్రమ రవాణా నివారించే క్రమంలో బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నదిలో ఇసుక త్రవ్వకాలు జరుపుతూ పట్టుబడితే అపరాధ రుసుము విధించటంతో పాటు తగు శిక్షలు విధించి వాహనాలను జప్తు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, ఆర్ఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.