Sidebar


Welcome to Vizag Express
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోండి

31-01-2025 19:28:18

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోండి 


ఇచ్ఛాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 31

 బహుదా నదిలో యదేచ్చగా ఇసుక అక్రమ త్రవ్వకాలు  జరుగుతున్నాయి. ఇసుక అక్రమ త్రవ్వకాలను అడ్డుకోవాలని మాజీ సిడాప్ చైర్మన్ సాడి శ్యాం ప్రసాద్ రెడ్డి అధికారులను కోరారు. శుక్రవారం నదిలో వంతెన పక్కనే జరుగుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. వంతెన పక్కనే తవ్వకాలు జరుపుతుండడంతో వంతెన మరింత బలహీనంగా మారే అవకాశం ఉన్నందున అధికారులు స్పందించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమ త్రవ్వకాలను అడ్డుకోవాలని కోరారు. వంతెన సమీపంలో పెద్దపెద్ద గోతులు తవ్వి ఇసుక కుప్పలుగా పోసి రవాణా అడ్డగోలుగా జరుగుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం సరికాదని అన్నారు