Sidebar


Welcome to Vizag Express
మాస్టారే "మా ఉన్నతకి కారణం కృష్ణమూర్తి ఉద్యోగ విరమణ సభలో పూర్వశిష్యులు

31-01-2025 19:29:35

 మాస్టారే "మా ఉన్నతకి కారణం

 కృష్ణమూర్తి ఉద్యోగ విరమణ సభలో పూర్వశిష్యులు 

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ప్రెస్ ,జనవరి 31:

నేడు మా ఈ ఉన్నతికి  ఉపాద్యాయులు అంబటి కృష్ణమూర్తే కారణమని ఆయన దగ్గర చదువుకున్న శిష్యులు అన్నారు. శుక్రవారం మందస మండలం బహాడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో  పదవీ విరమణ పొందిన హెచ్ఎం అంబటి కృష్ణమూర్తి వీడ్కోలు సభ ఘనంగా జరిగింది .ఈ సందర్భంగా పలువురు వక్తలు, ఆయన వద్ద చదువుకున్న శిష్యులు మాట్లాడుతూ  ప్రాథమిక విద్య నుంచి ఆయన వద్ద చదివి ఆయన సలహాలు పాటించడంవల్ల ఈ  స్థాయిలో ఉన్నామని  ప్రఖ్యాత గుండె వైద్య నిపుణులు డాక్టర్ దిలీప్ కుమార్ రట్టి ,కుందు రామారావు  (  డిప్యూటీ ఛీప్ ఇంజనీర్ ,ఇండియన్ రైల్వేస్ )అంబటి , మోహనరావు (  ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ,సోంపేట )   తోట ,ఈశ్వరరావు ,( నడుమూరు హైస్కూల్ హెచ్ ఎం )  సూరాడ ,చంద్ర మోహన్ ( టీడీపీ రాష్ట్ర కార్యదర్శి )తదితరులు పేర్కొన్నారు. ప్రస్తుతం మేమున్న ఈ స్థాయిలకు ఆయనే మూలకారణమని , ఆయన చూపించిన మార్గంలో నడవటం వల్లే ఈ స్థాయికి చేరుకున్నామని  అన్నారు. తన వద్ద చదివిన విద్యార్థులు ఎందులో రాణించగలరో  అనే విషయాన్ని క్షుణంగా పరిశీలించి ఆ రంగంలో సక్సెస్ అయ్యేలా తీర్చిదిద్దే గొప్ప మనసున్న వ్యక్తి కృష్ణమూర్తి మాస్టారని కొనియాడారు.  విలువలతో కూడిన విధ్యను అందించి గుర్తింపు పొందారని , ఆయన ఎక్కడ పనిచేసినా అక్కడ విద్యార్థులు భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా ఆయన ప్రత్యేక  విద్యా విధానాలు అవలంభించారని అన్నారు.  బహాడపల్లి గ్రామస్తులు ,ఉపాధ్యాయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాఠశాల నుంచి రిటైర్ అయ్యారు కానీ చదువుల నుంచి కాదని అన్నారు. డిప్యూటీ  డిఇఓ విలియమ్స్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువులు చెప్పడంతో పాటు భవిష్యత్తులో వారు ఏ రంగాలకు పనికొస్తారు అది ముందుగానే గమనించి ఆ స్థాయిలో వారికి విద్యాబుద్ధులు నేరపడంలో కృష్ణమూర్తి క్రమశిక్షణతో గుర్తింపు పొందారని కొనియాడారు. గ్రామ సర్పంచ్ ప్రతినిధి బొడ్డు శాంతి ప్రియ  ఉదయకుమార్  ,ఎస్ఎంసి చైర్మన్  వల్లభరావు ,గ్రామ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు సాలిన ఉమాపతి , సాలిన జోగారావు తదితరులు మాట్లాడుతూ కృష్ణమూర్తి మాస్టారు ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పాఠశాల పురోగ సాధించిందని, ఒకవైపు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ మరోవైపు పాఠశాల అభివృద్ధికి  కృషి చేశారని కొనియాడారు. అక్కుపల్లి ,బేతాళపురం ,మామిడిపల్లి ,ఎర్రముక్కాం  ప్రధానోపాధ్యాయులు  ఉమామహేశ్వరరావు  మాట్లాడుతూ ఆయన సేవలను ప్రస్తావించారు. అనంతరం వివిధ ఉపాధ్యాయ సంఘాలు కృష్ణమూర్తి  దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు  ఆకట్టుకున్నాయి