Sidebar


Welcome to Vizag Express
బారువ డిగ్రీ కళాశాలలో మేధో సంపత్తి హక్కుల వెబినార్.

31-01-2025 19:30:50

బారువ డిగ్రీ కళాశాలలో  మేధో సంపత్తి హక్కుల 
వెబినార్.

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 31:

ప్రభుత్వ డిగ్రీ కళాశాల , బారువ లో శుక్రవారం మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ పై ఆన్లైన్ రాష్ట్ర స్థాయి వెబినార్ ని ఐ క్యూ ఏ సి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమ లో కీ నోట్ స్పీకర్స్ గా ఐ పి ఆర్ & పేటెంట్ అటార్నీ ప్రతీక్ శ్రీవత్సవా , కాకినాడ పి.ఆర్.డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జే.పాండు రంగారావు లు మాట్లాడుతూ మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ, పేటెంట్స్ హక్కులు పొందే విధానం, వాటి ఆవశ్యకత గూర్చి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బారువ కళాశాల ప్రిన్సిపాల్ డా: డి.రామారావు  మాట్లాడుతూ  మేధో హక్కులు , పేటెంట్స్ ను పొందే విధానాలు కోసం  తెలియజేశారు.  ఈ కార్యమంలో కన్వీనర్ పండి రామకృష్ణ  ప్రసంగించారు. ఐ క్యూ ఏ సి కోఆర్డినేటర్ బడ్డ.రాంబాబు , ఎన్ఎస్ఎస్ పి.ఓ.లు పి.స్నేహాలత, టి.రాజేంద్రప్రసాద్ లు, కో కన్వీనర్లు టి.నీలకంఠము, జి.రాజేంద్రప్రసాద్, అకడమిక్ కోఆర్డినేటర్ కే హేమసుందర్, స్కిల్ హబ్ కోఆర్డినేటర్ తేజేశ్వర రావు, కళాశాల ఇతర అధ్యాపక బృందం, మరియు టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి.గోవిందమ్మ  రాష్ట్రంలోని  ఇతర కళాశాలల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ సందేహాలని కీ నోట్ స్పీకర్స్ తో మాట్లాడి తమ సందేహాలు ని నివృత్తి చేసుకున్నారు.