Sidebar


Welcome to Vizag Express
ప్రతిభాశీలికి సత్కారం

31-01-2025 19:32:14

ప్రతిభాశీలికి సత్కారం 


ఇచ్ఛాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 31

 విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తే ఉత్తమ ఫలితాలు వాటి అంతట అవే వస్తాయని ప్రభుత్వ బాలికల కళాశాల ప్రిన్సిపాల్ వి శంకరరావు అన్నారు. కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్న మీ బిందు రెడ్డి ఇంటర్ ఫస్టియర్ లో 470 మార్కులు గాను 457 మార్కులు సాధించింది. భేటీ బచావో - భేటీ పడవో కార్యక్రమంలో భగంగా జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఉన్నతధికారుల చేతుల మీదగా నగదు తో పాటు జ్ఞాపికను అందుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం కళాశాలలో సమావేశం నిర్వహించి విద్యార్థిని అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు సుధాకర్, బాపూజీ, యుగంధర్, ప్రసాదరావు, కరుణాకరావు, తదితరులు పాల్గొన్నారు.