Sidebar


Welcome to Vizag Express
జిల్లా బిజెపి అధ్యక్షుడిని అభినందించిన ఎమ్మెల్యే

31-01-2025 19:35:43

జిల్లా బిజెపి అధ్యక్షుడిని అభినందించిన ఎమ్మెల్యే
 
పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 31:
పార్వతీపురం మన్యం జిల్లా బిజెపి అధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన ద్వారపురెడ్డి శ్రీనివాసరావును ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర  శుక్రవారం నాడు తన క్యాంపు కార్యాలయంలో దుశ్శాలువ కప్పి, స్వీట్లు తినిపించి అభినందించారు. దీంతోపాటు మండల బిజెపి అధ్యక్షులుగా ఎన్నికైన వారిని కూడా ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.ఈసందర్భంగా దావోస్ పర్యటనలో పాల్గొని విజయవంతంగా పర్యటన పూర్తి చేసుకున్న ఎమ్మెల్యేగారిని కూడా జిల్లా బిజెపి అధ్యక్షుడు శ్రీనివాసరావు అభినందించారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్  సంజీవినాయుడు, పార్వతీపురం టౌన్ ప్రెసిడెంట్ వలిరెడ్డి పార్వతి, రూరల్ ప్రెసిడెంట్ బేతనాగభూషణరావు, సుందర ఆనంద్, కనకరాజు, శంకరరావు, చంద్ర తదితరులు పాల్గొన్నారు.