చింతలపాడు గ్రామం లో అటవీశాఖ అవగాహన కార్యక్రమం.
గుమ్మలక్ష్మీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,31:
గుమ్మలక్ష్మీపురం మండలంలోని దుడ్డుఖల్లు పంచాయితీ పరిధిలో గల చింతలపాడు గ్రామంలో అడవులను అగ్ని ప్రమాదాల నుండి కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆదేశాల మేరకు, కురుపాం ఫారెస్ట్ రేంజ్ అధికారి, డి. గంగరాజు, పంచాయతీ సర్పంచ్ , ఎన్. నీలావతి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు శుక్రవారం నాడు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి గంగరాజు మాట్లాడుతూ అడవులలో రానున్న వేసవి సీజన్ లో ,జీడితుప్పలు కాల్చుట, లేదా అడవుల్లోకి వెళ్ళేటప్పుడు చుట్టా, బీడీ లాంటి తెలియకుండా పడేసినప్పుడు అడవులు కాలిపోవడం జరుగుతుంది. దాని వల్ల జంతుజాల వృక్షజాలము మనుగడికి ఇబ్బంది కలుగుతుందని అన్నారు.
అంతే కాకుండా అక్రమ గంజాయి సాగు వల్ల కలిగే అనర్ధాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించటం జరిగింది, వాటి వలన కలిగే దుస్పరిమాణాలు గురించి కూడా వివరించారు, ఈ కార్యక్రమానికి అటవీ బీట్ అధికారి మహంతి రమేష్, ప్రత్యేక ఆహ్వానితులుబి.జె.పి. ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు నిమ్మక సింహాచలం, బేస్ క్యాంప్ సిబ్బంది పోలిరాజు , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.