పదవీ విరమణ పొందిన అదనపు ఎస్పీ అడ్మిన్ ఎల్. నాగేశ్వరి ని సన్మానించిన పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ.
పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 31:
పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు విధులు నిర్వర్తించి, ఎన్నో సమస్యలను ఎదురొడ్డి, కష్ట నష్టాలు ఓర్చి ఆరోగ్యంగా, ఆనందంగా స్వచ్చంద పదవీ విరమణ చెందటం అదృష్టమని, అలా ఆనందంగా, ఆరోగ్యంగా పదవీ విరమణ చేస్తున్న అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎల్. నాగేశ్వరి కి పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ తరపున ప్రత్యేక శుభాకాంక్షలను జిల్లా అధికారులు తెలియజేసారు.శుక్రవారం జిల్లా పోలీస్ శాఖ లో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చెందిన అదనపు ఎస్పీ(అడ్మిన్) ఎల్. నాగేశ్వరి ని జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఘనంగా సత్కరించి, వారి సేవలను కొనియాడి దుశ్శాలువాల తో సత్కరించి, జ్ఞాపికను వారికి అందజేసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశి ఆత్మీయ వీడ్కోలు పలికారు.
పదవీ విరమణ పొందిన అదనపు ఎస్పీ మాట్లాడుతూ పార్వతీపురం లో నా విద్యాభ్యాసం సాగింది అని, నేడు అదే ప్రాంతంలో విధులు చేపట్టి పదవీవిరమణ చేయడం చాల ఆనందంగా ఉందన్నారు.1989లో పోలీస్ డిపార్టుమెంటు లో ఎస్సై గా విధులలో చేరి, ఉమ్మడి ఆంధ్రాలో పలు ప్రాంతలో విధులు నిర్వర్తించానని,ఉద్యోగోన్నతి పొందిన తరువాత ఎక్కువకాలం సిఐడి లో విధులు నిర్వర్తించానని తెలియజేసారు. 36 ఏళ్లు సర్వీసులో అనేక ఒడిదుడుకులు, ఒత్తిడిలు ఎదుర్కొని అటు ఉద్యోగానికి ఇటు కుటుంబానికి సమాన తూకంగా వేసుకొని క్రమశిక్షణతో విధులు నిర్వర్తించానని, ఈ ఉద్యోగ ప్రయాణంలో సహాయపడిన అందరికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో పాలకొండ డిఎస్పీ రాంబాబు, ఎస్బీ సిఐ రంగనాధం,సోషల్ మీడియా,సైబర్ సెల్ సిఐ శ్రీనివాస రావు డిసిఆర్బి సిఐ రమేష్, ఆదామ్,ఏఆర్ ఆర్ఐ నాయుడు,రాంబాబు,శ్రీనివాస రావు మరియు పదవీ విరమణ పొందిన అదనపు ఎస్పీ కుటుంబ సభ్యులు, పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.