Sidebar


Welcome to Vizag Express
త‌ణుకు రూర‌ల్ ఎస్ ఐ ఆత్మహత్య

31-01-2025 19:40:22

త‌ణుకు రూర‌ల్ ఎస్ ఐ ఆత్మహత్య 

త‌ణుకు, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌;  సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇవాళ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. ఉదయం స్టేషన్‌కి వచ్చిన ఆయన, తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నట్లు తెలుస్తోంది. స్టేషన్‌లోనే కాల్చుకున్న తర్వాత, వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయనను హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునేసరికి ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసిన తర్వాత, వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడకపోయినా, సస్పెండ్‌కు గురవడంతో తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒక ఎస్‌ఐ తను పనిచేసే చోటే ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయ విషయమైంది. ఈ సంఘటన పోలీస్ శాఖలోని ఒత్తిడులు ,  మానసిక ఆరోగ్య సమస్యలపై ప్రశ్నలను ఎత్తిచూపుతోంది.