దయాల్ నగర్ గ్రామ నిధి ఆలయాన్ని అప్పగించాలి
పెదగంట్యాడ - వైజాగ్ ఎక్స్ప్రెస్ , జనవరి 31 ఈరోజు ఉదయం దయాల్ నగర్ క్వారీ రోడ్ నందు కమ్యూనిటీ హాలు వద్ద దయాల్ నగర్ గ్రామ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎస్.రాజారావు పత్రిక ప్రతినిధులు సమావేశంలో ప్రసంగిస్తూ మా గ్రామ సంక్షేమం కోసం అభివృద్ధి నిమిత్తం ఐక్యమత్యంగా సంఘమును స్థాపించితిమి. గత 20 సంవత్సరముల నుండి వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ గ్రామస్తుల శ్రమదానంతో దాతలు ఆర్థిక సహాయంతో స్వర్ణ నూకాoభిక ఆలయం నిర్మించితిమి. కిందటి నెల ఎనిమిదో తారీకు డిసెంబర్ 2024న జరిగిన సంఘటన మీద మా గ్రామ సభ్యుడైన ఆర్గనైజేషన్ సెక్రెటరీ అయినటువంటి పి మహాలక్ష్మి నాయుడిని గ్రామంలో అందరి సమక్షంలో కొట్టడం జరిగింది ఈ విషయం మీద ఆల్రెడీ న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఇంతవరకు ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు ఎందుచేతనంగా మాకు కూడా తెలియపరచాలని కోరుతున్నాను.
ప్రస్తుతం గ్రామo లో 74 వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డి స్వర్ణ నూకాంభిక ఆలయముకు తన గుప్పెట్లో ఉంచుకోవాలని దుర్బుద్ధితో పది రోజుల క్రితం స్వర్ణ నూకంబక ఆలయం అభివృద్ధి మహిళా కమిటీ ని ప్రకటించితిరి.28 1 2025న మరి కొంతమందితో మరొక స్వర్ణాంబిక ఆలయ అభివృద్ధి కమిటీ అంటూ పత్రిక ద్వారా ప్రకటించితిరి. ఈ యొక్క కమిటీలు గ్రామ కమిటీ కి విరుద్ధముగా వంశీ రెడ్డి ప్రోత్బలంతో వేసుకున్నవి.
కొత్త కమిటీ రాగానే గుడి కోసం పోసిస్తున్న ఆవును అమ్మివేయాలని నిర్ణయించిరి. ఆలయ ఉండిని తెరిచి అందులో ఉన్న డబ్బులు ఆభరణములు పంచుకోవాలని గ్రామ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్న కమిటీ కాదు ఆలయం ఆదాయం మీద ప్రేమ తప్ప ఆలయము సంక్షేమం మరియు కళ్యాణమండపం నిర్మాణము మధ్యలోవున్నా వాళ్లకు పట్టింపు లేదు. కాబట్టి అసoఘిక కార్యక్రమాలను అరికట్టాలని న్యూ పోర్టు పోలీస్ వారికి ఫిర్యాదు చేసితిమి. దయాల్ నగర్ గ్రామ వెల్ఫేర్ అసోసియేషన్ బోరువ అధ్యక్షులు చదరం మురళీకృష్ణ, ప్రెసిడెంట్ డాక్టర్ రాజారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ సీకు రమణ వైస్ ప్రెసిడెంట్ ముల్లు కోటేశ్వరరావు ఆర్గనైజేషన్ సెక్రటరీ పీఎం నాయుడు వైస్ ప్రెసిడెంట్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు