కలప లోడింగ్ లో జాగ్రత్తలు తీసుకోండి
సీఐ అశోక్ కుమార్
రాజాం. వైజాగ్ ఎక్స్ ప్రెస్ జనవరి 31
వాహనాలు పై కలప లోడింగ్ చెయ్యడం లో జాగ్రత్తలు తీసుకోవలని రాజాం సిఐ అశోక్ కుమార్ కోరారు.
రాజాంలో ఇటీవల కలపలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ మరియు ఇతర వాహనాలు తో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న ప్రమాదాలు దృష్ట్యా కలప డిపో యాజమాన్లకు కొన్ని సలహాలు సూచనలు సీఐ చేశారు . వాహనం పైన కలప అధికలోడుతో ప్రయాణించకూడదని , తరలించే ట్రాక్టర్, లారీలకు ముందు వెనుక సిగ్నల్ లైట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు.రేడియం స్టిక్కర్లతో నెంబర్ ప్లేట్ మరియు సిగ్నల్ సింబల్స్ ఉండాలని రాత్రిపూట రోడ్డుపైన కలపలోడులతో వాహనాలు నిలపరాదన్నారు.ఏదైనా కారణంతో రోడ్లు పైన వాహనాలు ఆగినట్లయితే వాహనం చుట్టూ తగిన విధంగా రక్షణ కంచే తో పాటు ప్రమాదాలకు గురికాకుండా కొన్ని చర్యలలతో పాటు కొన్ని జాగ్రత్తలు చేపట్టాలని వాహనం నడిపే డ్రైవర్లు మద్యం సేవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలప డిపో యాజమాన్యానికి సిఐ సూచనలు ఇచ్చారు