పండగ వాతావరణం లో చలి ఉత్సవం
. ఉత్సాహంగా సాగిన 5కే రన్
అరకు వ్యాలీ, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి 31: చలి అరకు ఉత్సవం పండగ వాతావరణం లో ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అరకు రైల్వే స్టేషన్ నుండి 5 కె రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 5కే రన్ లో 300 మంది ఉత్సాహవంతులు పాల్గొన్నారని చెప్పారు. 5కె రన్ అరుకు రైల్వే స్టేషన్ నుండి డిగ్రీ కళాశాల మైదానం వరకు సాగుతుందని చెప్పారు.5కె రన్ పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేస్తామని చెప్పారు. 5కె రన్ 300 మంది ఉత్సాహవంతులైన యువతి, యువకులు, పర్యాటకులు పాల్గొన్నారని చెప్పారు.
మూడు రోజులపాటు అరకు వ్యాలీ కేంద్రంలో చలి అరకు ఉత్సవం పండగ వాతావరణం లో ఉంటుందని పేర్కొన్నారు.
పురుషుల విభాగంలో వి రమేష్, (గన్నెల), ప్రథమ స్థానం,డి అభిషేక్ (కిన్నంగూడ), ద్వితీయ స్థానం,డి సామ్యూల్ (మజ్జీవలస) తృతీయ స్థానాల్లో నిలిచారు. మహిళల విభాగంలో సెకండ్ స్టాండర్డ్ విద్యార్థిని జీవన, (లిట్టిగూడ), ఎస్ మంజుల ద్వితీయ స్థానంలో నిలిచారు. అనంతరం విజేతలకు జిల్లా కలెక్టర్ బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం జె అభిషేక్ గౌడ, ఐటిడిఏ పిఓ వి .అభిషేక్, సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, ఏ ఎస్పీ ధీరజ్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జగన్మోహన్రావు, విద్యార్థులు, మహిళలు, పర్యాటకులు తదితరులు పాల్గొన్నారు.