రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి
మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
భీమిలి రూరల్, వైజాగ్ ఎక్స్ ప్రెస్ , ఫిబ్రవరి 1:
భీమిలి బీచ్ రోడ్డులో శుక్రవారం రాత్రి 10 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.భీమిలి మండలం చిప్పాడా వద్ద ఉన్న దివిస్ కంపెనీలో కెమిస్ట్రీ విభాగంలో పనిచేస్తున్న ఎం. ప్రదీప్(30) తన స్నేహితుడు కే. లోకేష్ (27)తో కలిసి బీచ్ రోడ్డు లో ద్విచక్ర వాహనం పై భీమిలి వైపు వస్తున్నాడు.ఈనేపథ్యంలో ఎర్రమట్టి దిబ్బలు వద్దకు చేరుకునే సరికి ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొంది.ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న ప్రదీప్ తలకు బలమైన గాయాలు అవ్వగా లోకేష్ కు తీవ్ర గాయాలయ్యాయి.దీంతో ఇరువురిని అంబులెన్స్ లో కేజీహెచ్ కి తరలించారు. చికిత్స పొందిన కొద్దిసేపటికి ప్రదీప్ మృతి చెందగా లోకేష్ చికిత్స పొందుతున్నాడు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.