Sidebar


Welcome to Vizag Express
సంక్షేమ పథకాలు కు మంగళం పాడిన చంద్రబాబు

01-02-2025 17:30:27

సంక్షేమ పథకాలు కు మంగళం పాడిన చంద్రబాబు

పి.గన్నవరం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 02:
పి.గన్నవరం లో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మండల విస్తుృత స్థాయి సమావేశం నక్క వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం  జరిగింది. ఈ సమావేశంలో పి.గన్నవరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు పాల్గొని, ప్రసంగిస్తూ గత ప్రభుత్వం లో అడగకుండానే అన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. కూటమి  ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సరం కాలం కావస్తున్న  ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో పెన్షన్ పథకం తప్ప మిగిలిన హామీలన్నీ కి మంగళం పాడారు అని, రాజ్యాంగ పరిపాలన మానేసి రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారని, విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు భారం అయ్యారని, ఉచిత ఇసుక పేరుతో కూటమి  నాయకులు చేస్తున్న, ఇసుక, మట్టి, మాఫియా.బెల్టు షాపులు పేరుతో మద్యం ఏరులై పారుతున్న విధానం, మీడియా వారు పేపర్లలో ఛానల్లో ప్రచారణ చేసినప్పటికీ తప్పులు సరిదిద్దుకోకుండా పాలన సాగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ రావు, యెన్నాబత్తుల ఆనంద్, మందపాటి కిరణ్ కుమార్,  ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, దొమ్మేటి దుర్గారావు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.