పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో వి. జానకి
ఆనందపురం, వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్, ఫిబ్రవరి 1.
ఆనందపురం మండలంలో 18 సచివాలయాలు ఉండగా 8632 పెన్షన్ దారులు కి ఎంపీడీవో వి. జానకి ఆధ్వర్యంలో 95.55 % పెన్షన్లు ఈరోజు ఇవ్వడం జరిగింది, ఫిబ్రవరి 2025 నెలకు సంబంధించిన సాంఘిక భద్రత పెన్షన్లను పంపిణీ తేది: 01.02.2025 ఉదయం 6:00 గంటల నుంచి ప్రారంభమయ్యింది. మండలంలోని 18 సచివాలయాల సిబ్బంది సమర్థవంతంగా పంపిణీ నిర్వహించారు. సాయంత్రం 5:00 గంటల వరకు మొత్తం పెన్షన్లలో 95.55% పంపిణీ పూర్తయ్యింది.
మండల ప్రత్యేకాధికారి శ్రీ చి. సత్తి బాబు (జిల్లా అధికారి, హౌసింగ్ డిపార్ట్మెంట్) మరియు ఎంపీడీవో డా. వి. జానకి కలిసి వేములవలస గ్రామ పంచాయతీ లో పెన్షన్ పంపిణీని తనిఖీ చేశారు.
మండలంలోని మొత్తం 8,248 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 3,50,09,500/-ల సాంఘిక భద్రత పెన్షన్లు పంపిణీ చేయబడినట్లు ఎంపీడీవో డా. వి. జానకి, హౌసింగ్ ఏ ఈ శ్యామ్, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .