Sidebar


Welcome to Vizag Express
శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి “పద్మభూషణ్” అవార్డు వచ్చిన సందర్భంగా జిల్లా నందమూరి అభిమాన సంఘం

01-02-2025 17:43:27

విజయనగరం టౌన్, వైజాగ్ ఎక్సప్రెస్ పీబ్రవరి 1

ప్రముఖ సినీ నటుడు, హిందూపూర్ శాసనసభ్యుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి “పద్మభూషణ్” అవార్డు వచ్చిన సందర్భంగా జిల్లా నందమూరి అభిమాన సంఘం ఆధ్వర్యంలో  ఈరోజు సాయంత్రం  ఎన్.సి.ఎస్. థియేటర్ వద్ద  కేక్ కట్ చేసి అభిమానులు సంబరాలు చేసుకున్నారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన  తెదేపా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి శ్రీ ఐ.వి.పి. రాజు గారు, ఎన్.సి.ఎస్. థియేటర్ ప్రొప్రైటర్ శ్రీ సినివాస్ గారు కేక్ కట్ చేసి అభిమానులకు, మరియు థియేటర్ సిబ్బందికి పంచిపెట్టారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా నందమూరి అభిమాన సంఘం అధ్యక్షులు కాగిత శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బంటుపల్లి రమేష్, కార్యదర్శి కనకల మన్మథరావు, కోశాధికారి కోట్యాడ వెంకటరమణ, మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ప్రసాదుల వరప్రసాద్, బొద్దుల నర్సింగరావు, శ్రీ కనకల మురళీమోహన్, శ్రీ ఆల్తి బంగారుబాబు, శ్రీ గంటా పోలినాయుడు, కంది మురళీనాయుడు, మైలపిల్లి పైడిరాజు, కోండ్రు శ్రీనివాసరావు మరియు అభిమలు పాల్గొన్నారు