Sidebar


Welcome to Vizag Express
వేతనదారులంతా పనులకు హాజరు కావాలి

01-02-2025 17:44:50

వేతనదారులంతా పనులకు హాజరు కావాలి ః జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్‌ విజ్ఞప్తి*
#️⃣చిన్నకారు రైతుల భూముల్లో వ్యవసాయ అనుబంధ పనులు చేసుకొనే అవకాశం
#️⃣ఈ పథకాన్ని వారంతా వినియోగించుకోవాలి : కలెక్టర్ సూచన

విజయనగరం, టౌన్ వైజాగ్ ఎక్సప్రెస్,ఫిబ్రవరి 01 :
జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో నమోదు చేసుకున్న వేతనదారులంతా తమ గ్రామాల్లో వెంటనే పనులకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్‌ డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ కోరారు. జిల్లాలోని 27 మండలాల్లో గల 775 గ్రామ పంచాయతీల్లోనూ పనులను ప్రారంభించడం జరిగిందని,  ఈ పనుల్లో పాల్గొనడం ద్వారా ప్రతిరోజూ రూ.300 వేతనం పొందేలా పనిచేయాలని సూచించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా వ్యవసాయ అనుబంధ పనులైన ఫారం పాండ్లు, బౌండరీ ట్రెంచ్‌ లు, రింగ్ ట్రెంచ్‌లకు ప్రాధాన్యత ఇస్తూ చిన్న సన్నకారు రైతుల భూముల్లో యీ పనులు చేయించుకోవచ్చన్నారు. చిన్న సన్నకారు రైతులంతా యీ అవకాశాన్ని వినియోగించుకొని తమ భూముల్లో నీటి నిల్వ కందకాలు తవ్వుకోవాలన్నారు.
దీనితో పాటు చిన్నకారు రైతుల మెట్ట భూముల్లో పండ్లతోటల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, గడ్డి పెంపకం, పూల పెంపకం పనులు కూడా చేసుకోవచ్చన్నారు.
జిల్లాలో పనుల సీజను మొదలైనందున వేతనదారులు ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న పనుల్లో పాల్గొని అధిక వేతనాలు పొందవచ్చని డ్వామా పథక సంచాలకులు శారదాదేవి పేర్కొన్నారు.

జారీ జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి, విజయనగ