Sidebar


Welcome to Vizag Express
ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు ను కలిసిన నిమ్మక జయరాజ్

01-02-2025 17:46:12

విజయనగరం టౌన్, వైజాగ్ ఎక్సప్రెస్ ఫిబ్రవరి 1
ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు ను కలిసిన నిమ్మక జయరాజ్
 మాజీ  ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్  రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు ను విజయనగరం లోని చైర్మన్ క్యాంప్  కార్యాలయంలో  శనివారం కలిసారు.ఈ సందర్భంగా ఆయన
పలు గిరిజన సమస్యలను  డాక్టర్ డివిజి శంకరరావు దృష్టి కి తీసుకు వచ్చారు. 
గిరిజన గ్రామాల్లో తాగునీరు,రహదారు సమస్యలు వెన్నాడుతున్నాయన్నారు.  ప్రధానంగా  అత్యవసర వైద్య సహాయం అవసరమైన సందర్భంలో  ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనడంతో పాటు  ప్రాణపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.  మాజీ ఎమ్మెల్యే నిమ్మజ జయరాజ్ తోపాటు  గిరిజన ఉద్యోగి మండంగి బాలా కుమారి
చైర్మన్ ను కలిసారు.
తనకు
పోస్టింగ్ ఇవ్వకపోగా,నాలుగు నెలలుగా జీతం కూడా ఇవ్వడం లేదని తెలిపారు. తాను వెంటనే విధుల్లో చేరేందుకు  అధికారులు  సహకరించేలా చూడాలని బాలాకుమారి  కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు కు విజ్ఞప్తి  చేశారు. 
చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు స్పందిస్తూ  సమస్యలను కమీషన్ తప్పక పరిశీలించడం జరుగుతుందని,అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.