డాక్టర్.వై.సురేష్ కుమార్ వైద్య సేవలు వినియోగించుకోండి.
రేగిడి ఫిబ్రవరి 1 వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్
రేగిడి ఆమదాలవలస మండలం ఉంగరాడ మెట్ట వైర్లు ఫ్యాక్టరీ వద్ద ఉన్న అయ్యప్ప మెడికల్ మరియు అయ్యప్ప క్లినిక్ నందు ప్రముఖ జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్, యలకల సురేష్ కుమార్ వైద్య సేవలకు అందుబాటులో ఉంటారని, అయ్యప్ప క్లినిక్ ప్రోప్రైటర్ నిలురోతు మహేష్ అన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ డాక్టర్, సురేష్ కుమార్ మణిపాల్
కె.ఎం.సీ.యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ పొందారని, అలాగే గత 15 సంవత్సరాలు కాలంలో జి.ఎం.ఆర్. కేర్ ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్ గా సేవలు అందించి రాజాo పరిసర ప్రాంతాల్లో మంచి డాక్టర్ గా పేరు పొందారని, ఇటీవల సురేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి రాజాo పరిసర ప్రాంత ప్రజలకి వైద్య సేవలు అందించి సురేష్ డాక్టర్ భలే డాక్టర్ అని పేరు పొందారని, ఇంకా వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఉంగరాడ మెట్ట వద్ద అయ్యప్ప క్లినిక్ నందు ప్రతి బుధవారము మరియు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు అందుబాటులో ఉంటారని,ఈ వైద్య సేవలను ఉంగరాడ మెట్ట పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు.