ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ఆయన రఘువర్మ
ఎపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గవ్వ. భీమారావు
సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,ఫిబ్రవరి 1:
విద్యారంగ మరియు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేసే అతి సాధారణ వ్యక్తి పాకలపాటి రఘువర్మ అని ఎపిటియఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు గవ్వ. భీమారావు ఒక ప్రకటనలో తెలిపారు.ఆయన తన జీవితాన్ని, జీతాన్ని పేద విద్యార్థుల సంక్షేమం మరియు విద్యారంగ పరిరక్షణమరియు ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారానికి త్యాగం చేసాన్నారు.ఉపాధ్యాయులు కి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తూ, ఉపాధ్యాయ వాణిని శాసనమండలిలో వినిపించే వ్యక్తి అయిన ఎపిటిఎఫ్ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ ను మరోసారి శాసనమండలికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కరోనా కష్టకాలంలో అసువులుబాసిన ఉపాధ్యాయ కుటుంబాలను పరామర్శించి, వారిని ఓదారుస్తూ... వారికి ప్రభుత్వం రావాల్సిన బెనిఫిట్స్ త్వరతగతిన మంజూరు అయ్యేవిధంగా చేస్తూ, వారి కుటుంబ సభ్యులకి రావాల్సిన కారుణ్య నియామకాలు గూర్చి కృషి చేసారు. ఈ సందర్బంగా అయన గెలుపు కొరకు ఏ పీ టీ యఫ్ మందస నాయకులు గత 10 రోజులుగా పాఠశాల పనివేళల అనంతరం ఉపాధ్యాయ ఎంఎల్సీ ఓటర్లు ఇంటికి వెళ్లి, ఇంటింట ప్రచారం చేస్తూ ఈ నెల 27 న జరిగే ఎన్నికల్లో ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.ఇటీవల కాలంలో అయన అభ్యర్థిత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయులు సంఘం కూడా మద్దతు తెలిపిందని,ఇతర మిత్ర సంఘాలు కూడా ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని వారు ఒక ప్రకటనలో తెలిపారు.అదే విధంగా ఈ నెల 4వ తేదీన విశాఖపట్నం లో అతను నామినేషన్ వేయనున్నారు అని, సదరు కార్యక్రమం లో అధిక సంఖ్యలో కార్యకర్తలు మరియు ఉపాధ్యాయులు పాల్గొనాలని ఏ పీ టీ యఫ్ మందస నాయకులు తెలిపారు.గత 10 రోజులుగా మందస మండలంలోని మందస, హరిపురం, బాలిగాం, డబారు, జిల్లుండ, కొత్తపల్లి, సొండిపూడి, మూలిపాడు, కుంటికోట, మాఖరజోల, జిల్లుండ,బెల్లుపటియా, సిరిపురం,పొత్తంగి తదితర గ్రామాల్లో కొనసాగుతున్న ఈ ప్రచార కార్యక్రమం లో ఏ పీ టీ యఫ్ మందస అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యస్. కిరణ్ కుమార్, కె. సుందర రావు, సీనియర్ కార్యకర్త వి. వి. వరప్రసాద్, ఇతర కార్యవర్గ సభ్యులు డి. వైకుంఠ రావు, యన్. కరుణాకర్,బి. తిరుపతి రావు,డి. చంద్రశేఖర్, యన్. ఢిల్లేశ్వర రావు, యస్ గణేశ్వర రావు,యస్ నారాయణరావు, యస్ జగన్నాధరావు,బి. మురళీ మోహన్,బి. బైరాగి,డి. మోహన రావు,డి. రామారావు,యం. చిత్రసేను, యస్ సూర్యారావు,జీ. వసంత్, బి. శివ, డి. వేణుగోపాల్ మరియు బి. రమేష్ తదితరులు పాల్గొన్నారు