వేడుకగా మొదలైన శతాబ్ది ఉత్సవాలు
01-02-2025 22:04:10
వేడుకగా మొదలైన శతాబ్ది ఉత్సవాలు
భీమునిపట్నం వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్ ఫిబ్రవరి 1;భీమిలి ప్రభుత్వ పాఠశాల వంద సంవత్సరాల పండుగ శనివారం ఘనంగా మొదలైంది. శనివారం మధ్యాహ్నం ప్రభుత్వ పాఠశాలలో నిర్మించిన వంద సంవత్సరాల పైలాన్ ను ముందుగా స్థానిక శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను అధికారికంగా ఆయన ప్రారంభించారు. పాఠశాల పూర్వ విద్యార్ధులు ఎం మహీధర్, అడిషనల్ కమిషనర్, ఇంకమ్ టాక్స్ మరియు జి క్రాంతి కుమార్, ఐ జి, జార్ఖండ్ స్టేట్ లను పైలాన్ నిర్మాణానికి పూర్తి ధన సహాయం చేసిన కట్టమూరి పోతన్న శెట్టి కుమారులను గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులలో ఉన్నత పదవుల్లో ఉన్నవారిని, ఇంతకు ముందు ఈ పాఠశాలలో గురువులగా పనిచేసి పదవీ విరమణ చేసిన వారికి కూడా ఈ సందర్భంగా సత్కరించారు. భీమిలి కె జి బి వి విద్యార్ధినుల చే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వేదిక పై శతాబ్ది ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు కె ఎస్ ఎన్ మూర్తి, అధ్యక్షుడు గాడు అప్పలనాయుడు, కార్యదర్శి మైలపల్లి లక్ష్మణ రావు, కోశాధికారి పూసర్ల శ్రీనివాసరావు, కన్వీనర్ మైలపల్లి షణ్ముఖరావు, తదితరులను ఘనంగా సత్కరించారు. సాయంత్రం భీమిలి పుర వీధుల్లో పూర్వ విద్యార్ధులు మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సన్నాయి మేళాలతో, కోలాటం మొదలైన వాటితో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఆదివారం మరిన్ని కార్యక్రమాలను శతాబ్ది ఉత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించనున్నారు