ఆర్థిక అక్షరాస్యత, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన
01-02-2025 22:06:34
ఆర్థిక అక్షరాస్యత, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన
ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి, 01: భారతీయ స్టేట్ బ్యాంక్ విశాఖ రీజినల్ మేనేజర్ ఆదేశాల మేరకు నాబార్డ్ సంస్థ ఆర్థిక సహాయంతో మండల కేంద్రంలో శనివారం జరిగిన వారపు సంతలో ముంచంగి పుట్టు స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం విభూతి బ్రదర్స్ కళాజాతర బృందంతో వారపు సంతలో వచ్చిన ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన వారు తక్షణమే 1930 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. కళా జాతర బృందం మెజీషియన్ మ్యాజిక్ షో వీధి నాటక జానపద గీతాలు హాస్య అల్లర్లతో బ్యాంకు స్కీములపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకం, ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎన్ పి సి ఎస్ వాట్సన్ పీఎం విశ్వకర్మ ముద్ర రుణాలపై అవగాహన కల్పించారు. బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలని కెసిసి రెవిన్యూల్ కోసం మనకు తెలియని వారికి బ్యాంకు సమాచారం తెలియపరచరాలని ప్రజలకు వివరించారు. మండల కేంద్రంతో పాటు సుజనకోట పంచాయతీ కేంద్రంలో డ్వాక్రా మహిళలకు, స్థానికులకు, ప్రజలకు, బ్యాంకు స్కీము లను వివరించారు. కార్యక్రమంలో మంచంగిపుట్టు స్టేట్ బ్యాంక్ మెసెంజర్ ఎస్ చంద్రశేఖర్, తదితరులు ఉన్నారు.