పళ్ళు తోపుడుబల్ల వ్యాపారులతో ట్రాఫిక్ కు అంతరాయం
01-02-2025 22:11:04
పళ్ళు తోపుడుబల్ల వ్యాపారులతో ట్రాఫిక్ కు అంతరాయం
మంచంగిపుట్టు,వైజాగ్, ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి,01: మండల కేంద్రంలో శనివారం జరిగిన వారపు సంతలు సాయంత్రం నాలు రోడ్ల కూడలి వద్ద ఇరువైపులా పళ్ళు తోపుడుబళ్ళ వ్యాపారస్తులు నాలుగు రోడ్ల కూడల వద్ద ట్రాఫిక్ ని తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు.గత శనివారం తోపుడు బల్ల వ్యాపారస్తుల నిర్లక్ష్య కారణంగా రెండు నిండు ప్రాణాలు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. నాలుగు రోడ్ల కూడలి వద్ద తోపుడు బండ్లు పెట్టి వ్యాపారం కొనసాగిస్తున్న సమయంలో వారపు సంత ముగించుకొని జోలపుట్టు వైపు వెళుతున్న భారీ లారీ అకస్మాత్తుగా వెనకకు రావటంతో చాకచక్యంగా రెండు ద్విచక్ర వాహనదారులు ప్రాణం కాపాడుకున్న సంఘటన చోటుచేసుకుంది.మండల కేంద్రంలో జరిగే ప్రతి శనివార పు సంతలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తూ ఉన్న ఉన్నప్పటికీ కొంతమేర సమస్య తీరిందని వారపు సంతకు వచ్చిన ప్రజలు ఊపిరి పీల్చుకుంటే. మైదన ప్రాంతాలకు చెందిన పల్లు వ్యాపారస్తులు నాలుగు రొడ్లకూడాలి ఇరు వైపులా విచ్చలవిడిగా తోపుడుబల్లు పెట్టీ వ్యాపారం కొనసాగిస్తూ ఉండటంతో వారపు సంత ముగించుకుని తిరుగు ప్రయాణంలో వెళుతున్న వాహనాల తీవ్రమైన ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందు పడుతున్నరు. వాహన చోదకులు ప్రజలు ఇప్పటికైనా తోపుడుబండ్ల వ్యాపరస్తులపై సంబంధించిన అధికారులు చర్యలు చేపట్టాలని వారపు సంతకు వచ్చిన ప్రజలు, మోహన్, పూర్ణ, అర్జున్, సీతారాం, కాసుబాబు, గణపతి, తదితరులు, కోరుతున్నారు.