Sidebar


Welcome to Vizag Express
ప్రజా పోరాటాలతో స్టీల్ ప్లాంట్ రక్షణ ఉద్యమం

01-02-2025 22:12:09

ప్రజా పోరాటాలతో స్టీల్ ప్లాంట్ రక్షణ ఉద్యమం
 
  నెల్లూరు, వైజాగ్ ఎక్స్ ప్రెస్; ప్రజా పోరాటాలతోనే స్టీల్ ప్లాంట్ రక్షణ సాధ్యమని ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని సిపిఎం పాలిట బ్యూరో సభ్యులు బేబీ, బి వి రాఘవులు అన్నారు. శనివారం నెల్లూరులో రాష్ట్ర సిపిఎం పార్టీ మహాసభల సందర్భంగా గతనెల 28 వ తారీఖున స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమ కేంద్రం నుంచి బయలుదేరిన ఉద్యమ జ్యోతి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పర్యటించి విశాఖ ఉక్కు రక్షణకు జరిగే పోరాటాన్ని ప్రజలకు వివరిస్తూ ఆ జ్యోతిని సిపిఎం పార్టీ పొలెట్ బ్యూరో సభ్యులు బి వి రాఘవులు, బేబీ లకు అందజేశారు. ఈ సందర్భంగా బి వి రాఘవులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ రక్షణకు ప్రజా పోరాటాలను ఉదృతం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచే విధంగా దోహదపడుతుందని ఆయన అన్నారు. భావితరాలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే ప్రభుత్వ రంగాన్ని రక్షించడం ద్వారానే సాధ్యమవుతుందని ఆయన వివరించారు. అందులో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ సముద్ర తీర ప్రాంతంలో ఉందని దీనికి గల భూసంపద ద్వారా ఉత్పత్తి పెంచుకోవడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. దీనికి ముడి ఖనిజాన్ని కేటాయించడం ద్వారా ఉత్పత్తి అంతరాయాలు తగ్గి లాభాలు ఆర్జిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కనుక ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.  ఈ విప్లవ జ్యోతిని స్టీల్ ప్లాంట్ నుండి నెల్లూరు వరకు సిపిఎం స్టీల్ డివిజన్ నాయకులు యు రామస్వామి, బి మహేష్, జి శ్రీనివాసరావు, గురప్ప, సోమేశ్ తీసుకువెళ్లి అక్కడ అందించారు.