అంకెల గారడీ బడ్జెట్
.కేంద్రబడ్జెట్ పై సీపీఐ నిరసన
విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్:పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 8వ సారి ప్రవేశపెట్టిన 50 లక్షల 65 వేల 345 కోట్లు రూపాయల బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొకసారి గుండు సున్న పెట్టారని, ఇది కేవలం అంకెల గారడీ బడ్జెట్ అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు ఆరోపించారు. కేంద్రబడ్జెట్లో రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర కు జరిగిన అన్యాయానికి నిరసనగా శనివారం సాయంత్రం రైల్వేస్టేషన్ ఎదురుగా ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ విశాఖ పర్యటనలో దేశ ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీ విశాఖ కేంద్రంగా దక్షణ కోస్తా రైల్వే జోన్ ప్రకటన చేశారని ఇటీవలే జనవరి 8 న జోనల్ కార్యాలయం కోసం శంకుస్థాపన చేశారని
నేటి బడ్జెట్లో తగిన నిధులు కేటహించలేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విభజన సమయంలో చేసిన వాగ్దానాల అమలుకు నిధుల కేటాయింపు చేయకపోవడం మరోసారి రాష్ట్ర ప్రజానీకాన్ని వంచనకు గురిచేయడమేనని పేర్కొన్నారు. ఎన్ డి ఎ ప్రభుత్వంలో కూటమి భాగస్వామిగా ఉన్న టీడీపీ, జనసేన నేతలు కేంద్రాన్ని ప్రశ్నించడంలో విఫలం అయ్యారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారని కనీసం ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ప్రకటన గాని, సెయిల్ విలీనం ప్రకటన గాని చెయ్యలేదని ఆవేదన వ్యక్తంచేశారు. సామాన్యులకు నష్టం చేస్తూ కార్పొరేట్ వర్గాలకు అనుకూల బడ్జెట్ అని అన్నారు. ఇది కేవలం త్వరలో బీహార్ శాసనసభ ఎన్నికలు జరుగురున్న దృశ్య వారికి ఊరట కలిగించే విదంగా ఉన్నది తప్పితే దేశంలో ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలుకు నష్టంగాను, కార్పొరేట్లకు ఉపయోగం చేసే విదంగా ఉన్న బడ్జెట్ అని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సత్యనారాయణ, ఎస్ కె రెహమాన్, పి చంద్రశేఖర్, ఎం మన్మధరావు, ఆర్ శ్రీనివాసరావు, నాయకులు జి కాసుల రెడ్డి, బి పుష్ప, కె రాధ, ఎ దేవుడమ్మ, ఎ ఆదినారాయణ తదితరులతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు పాల్గొన్నారు.