గిరిజన సంస్కృతి తో సుస్థిరమైన పర్యాటక అభివృద్ధి చేస్తాం
.అరకు పూల బొకేలు తయారీలో గిరిజన యువతకు శిక్షణ
.జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
అరకు వ్యాలీ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 1:
ఆంధ్రా ఊటీ లో గిరిజన సంస్కృతి తో సుస్థిరమైన పర్యాటక అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. అందాల అరకలోయ పూల బొకే లను రాష్ట్రానికి తొలి పరిచయం చేస్తామని చెప్పారు.చలి అరకు ఉత్సవం రెండవ రోజున స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో శనివారము ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పార్కు కు విళుదగల్ అని నామకరణం చేశారు. జిల్లా కలెక్టర్ అమ్మ షణ్ముగ వల్లి పేరిట మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరకు ప్రాంతంలో పూల పెంపకానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. బాకెల తయారీలో నైపుణ్యం వున్నవారిని తీసుకు రావడం జరిగిందని అన్నారు.వారితో గిరిజనులకు తగిన శిక్షణ అందిస్తామని చెప్పారు . బొర్రా నుండి డిగ్రీ కళాశాల మైదానం వరకు సైకిల్ తొక్కడం పోటీని ప్రారంభించామని చెప్పారు.సైకిల్ రైడ్ లో 20 మంది పాల్గొన్నారని తెలియజేసారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా సైకిల్ రైడ్ నిర్వహించామని పేర్కొన్నారు.అరకు అబ్బాయి ద్వితీయ స్థానంలో నిలిచారని అన్నారు.అరకు బ్రాండ్ సైకిలిస్ట్ గా తయారై రాష్ట్ర,జాతీయ స్థాయి లో పాల్గొని ఆయన ఏజెన్సీ కి మంచి పేరుతెస్తాడన్నారు. అయకు ఐటిడిఎ నుండి రైడ్ సైకిల్ స్పాన్సర్ చేస్తామని ప్రకటించారు. 2వ తేదీన సుంకర మెట్ట నుండి గాలికొండ వ్యూ పాయింట్ వరకు ట్రెక్కింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఫ్యాషన్ షో నిర్వహిస్తామని చెప్పారు.మూడవరోజు వివిధ సంస్కృతి కార్యక్రమాలు,ఫోక్ సింగర్ మంగ్లీ పాటలు పాడతారని తెలిపారు.
సైకిల్ రైడ్ విజేతలకు బహుమతులు అందజేశారు. మధ్య ప్రదేశ్ కు చెందిన ఓ. పి. అగర్వాల్ (66) మొదటి స్థానం ,అరకు లోయ మండలం దండబాడు గ్రామానికి చెందిన పాంగీ అజయ్ (13)ద్వితీయ,విశాఖ కు చెందిన ప్రియదర్శిని తృతీయ స్థానంలో నిలిచారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సబ్ డీ. ఎఫ్ ఓ ఉమా మహేశ్వరి,ఎం.పి. డి. ఓ లవరాజు, డి ఎల్ పి వో పి.ఎస్.కుమార్,పి.ఆర్. డి.ఈ రామం తదితరులు పాల్గొన్నారు.