Sidebar


Welcome to Vizag Express
పరస మహోత్సవంలో నగర మేయర్

01-02-2025 22:15:29

పరస మహోత్సవంలో నగర మేయర్ 

విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 1:
శ్రీ నూకాంబిక పరస మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషమని నగర మేయర్  గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శనివారం ఆమె 59 వ వార్డు పాత చెక్ పోస్ట్ వద్ద ఉన్న నూకాంబిక, కాశి విశ్వేశ్వర స్వామి, శ్రీ శిరిడి సాయి పరస మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా 
నగర మేయర్ మాట్లాడుతూ పండుగలు తీర్థ మహోత్సవాలు మన సాంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తాయని అలాగే ప్రజల్లో భక్తి తో పాటు సహాయ సహకారాలు అందించుకునేందుకు ఉపయోగపడతాయని, ఇటువంటి పరస మహోత్సవంలో పాల్గొని ఆ భగవంతుని  కృపకు పాత్రులు కాగలరని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎదురు వెంకటరావు గౌరవ చైర్మన్ అప్పారావు, కన్వీనర్వి వెంకటరావు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.