Sidebar


Welcome to Vizag Express
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిలుపుదల

01-02-2025 22:16:35

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిలుపుదల

*జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్

అనకాపల్లి, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 1: జిల్లాలో శాసన మండలి సభ్యుల ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజి ఆర్ ఎస్) నిలుపుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్,  జిల్లా ఎన్నికల అధికారి విజయ క్రిష్ణన్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు  కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందన్నారు.  ఫిబ్రవరి, 27వ తేదీన ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఓట్ల లెక్కింపు కార్యక్రమం మార్చి, 3వ తేదీన జరుగుతుందని, ఎన్నికల ప్రక్రియ మార్చి  8వ తేదీన ముగుస్తుందన్నారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందన్నారు.  జిల్లాలో శాసన మండలి సభ్యుల ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం, మండల కార్యాలయంలలో నిర్వహించే  ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజి ఆర్ ఎస్) నిలుపుదల చేయడం జరిగిందని, దీనిని ప్రజలు గమనించవలసినదిగా విజ్ఞప్తి చేశారు.