రథసప్తమి వేడుకల్లో ఆకాశంలో విహారం
హెలికాప్టర్ లో ప్రయాణ టికెట్ ధర రూ.1800 గా నిర్ణయం
శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 1:
రథసప్తమి వేడుకల సందర్భంగా ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు శ్రీకాకుళం నగరంలోని "డచ్" భవనం ప్రాంగణంలో హెలికాప్టర్ ద్వారా విహరించే అవకాశాన్ని ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేసింది. ప్రతి ట్రిప్పుకు విహరించే కాలం 5 నిమిషాలుగా నిర్ణయించారు. ఒక్కొక్కరికి టికెట్ ధర రూ.1800/-లు. 2 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రవేశం లేదు. హెలికాప్టర్ రైడ్ టికెట్స్ ఆన్ లైన్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి. ఆన్ లైన్ ద్వారా టికెట్స్ పొందడం తెలియని ప్రజల కోసం శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ని ఏర్పాటు చేయడమైనది. సిబ్బంది ఆన్ లైన్ లో టికెట్స్ ఎలా పొందాలో మీకు తెలియజేసి మీ తరపున టికెట్ బుక్ చేసి, టికెట్ కాపీని మీకు అందిస్తారు. టికెట్స్ కేవలం ఆన్ లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి. నగదు చెల్లింపులు ఎక్కడా అనుమతించబడవు. హెలికాప్టర్ రైడ్ బుక్ చేసుకున్న తేది, సమయానికి అనుగుణంగా ఫిబ్రవరి 2, 3, 4 తేదీలలో ఉదయం 9 గం. నుండి సాయంత్రం 5 గం.ల మధ్య ఉంటుంది. హెలికాప్టర్ ద్వారా విహరించే అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని యంత్రాంగం ఒక ప్రకటనలో కోరింది. టికెట్ల బుకింగ్ కోసం heliride.arasavallisungod.org వెబ్సైట్ ను సందర్శించాలని సూచించింది.