Sidebar


Welcome to Vizag Express
దళితులు, గిరిజనుల భూముల జోలికి ఎవరొచ్చినా సహించేది లేదు

01-02-2025 22:22:35

దళితులు, గిరిజనుల భూముల జోలికి ఎవరొచ్చినా సహించేది లేదు

ఎమ్మెల్యే విజయ్ చంద్ర
పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 1:
దళితులు, గిరిజనుల జోలికి ఎవరొచ్చినా సహించేది లేదని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం మండలం పెదబొండపల్లి , ఎమ్మార్ నగర్  గ్రామంలో దళిత భూముల ఆక్రమణ విషయంలో ఆయన తీవ్రంగా స్పందించారు. 1980లో గ్రామానికి చెందిన కొంతమంది దళితులకు ప్రభుత్వం ఎకరా చొప్పున భూమి ఇచ్చిందిన్నారు. ఆ భూమిలో వాళ్లు మామిడి, జీడి వంటి తదితర పంటలు సాగు చేశారు అని వివరించారు. 2019 వరకు వారి సాగు బడిలోనే ఉన్నాయని వైయస్సార్ పాలనలో అక్రమాలకు తెర తీశారని ఆరోపించారు.
వైయస్సార్సిపి అండదండలతో జోగారావు సహకారంతో చుక్క శ్రీదేవి దళితుల భూముల్లో రోడ్లు వేయడం హద్దులు వేయడం చేశారని ఇది ఏమాత్రం సమంజసం కాదని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. వైఎస్ఆర్సిపి పాలనలో ఎన్నో  భూ అక్రమాలు  చోటుచేసుకున్నాయని వాటికి చరమగీతం పాడతామన్నారు. అప్పటి ఎమ్మెల్యే జోగారావు దళితుడై ఉండి దళితులకు అన్యాయం  తలపెట్టడం సరైనది కాదన్నారు. ఈ విషయంలో తీవ్రంగా స్పందిస్తున్నామని దళితులకు అన్యాయం చేస్తే సహించేది లేదని తక్షణమే శ్రీదేవి పై  పోలీసులు , రెవెన్యూ అధికారులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలన్నారు.  దశాబ్దాలుగా భూమిని నమ్ముకున్న దళితులకు అన్యాయం చేసే వారిని చూస్తూ ఊరుకోమని తగు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే విజయ్ చంద్ర  హెచ్చరించారు.