Sidebar


Welcome to Vizag Express
జగన్నాధపురం లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కౌమార బాల బాలికల కొరకు ప్రత్యేక క్లినిక్

01-02-2025 22:23:47

జగన్నాధపురం లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కౌమార బాల బాలికల కొరకు ప్రత్యేక క్లినిక్ 
పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 1:
 పార్వతీపురం మన్యం జిల్లాలోని జగన్నాధపురం లో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కౌమార బాల బాలికల కొరకు ప్రత్యేక క్లినిక్  ను ప్రతి శుక్రవారం, శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు తనిఖీ చేయడం జరుగుతుందని డాక్టర్ ఎం. చంద్ అన్నారు. కౌమార బాల బాలికల ప్రత్యేక క్లినిక్ లో బాల బాలికల సామాజిక పెరుగుదల సమస్యలపై చికిత్స, కౌన్సిలింగ్, రిఫరల్ సేవలు చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జగన్నాధపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి చుట్టుపక్కల వీధులలో ర్యాలీ చేయడం జరిగిందని డాక్టర్ ఎం.చంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ వి. ఇందిర, స్టాఫ్ నర్స్ శశికళ, ప్రియాంక, ఫార్మసిస్ట్ రవి, డేటా ఆపరేటర్ రమేష్, ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.