విజయనగరం టౌన్, వైజాగ్ ఎక్సప్రెస్ జనవరి 3
పేదలకు ఇంటి స్థలాలు, సాగుభూమి సాధించేవరకు పోరాటం
కూటమి ప్రభుత్వ ఎన్నికల హమీలో బాగంగా పట్టణాల్లో 2సెంట్లు, గ్రామాల్లో 3సెంట్లు స్థలం, ఇంటి నిర్మాణానికి 5లక్షలు, 2ఎకరాల సాగుభూమి హామీ తక్షణం అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ డిమాండ్ చేశారు.
ఈరోజు ఉదయం గంట్యాడ మండలం నరవ గ్రామంలో మండల సిపిఐ కార్యదర్శి కాళ్ళ కృష్ణ నేతృత్వంలో జరిగిన ప్రచార కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ లు హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఒమ్మి రమణ
గత ప్రభుత్వం జగనన్న కాలనీల నిర్మాణం కేవలం 1 సెంటు స్థలంలో ఇండ్లు నిర్ధిష్ట కాలవ్యవధిలో పూర్తి చేసుకోవన్న షరతులకు బయపడి అధిక వడ్డీలకు అప్పు తెచ్చి ఇంటి నిర్మాణం పూర్తి కాకుండానే ఖండింపు ఆయకంలో ఇండ్లును కోల్పోవలసి వచ్చింది. ఇంటి స్థలం, నిర్మాణ వ్యయం సరిపోదని నూటికి తొంబైశాతం ప్రజలు నిర్మాణానికి ముందుకు రాలేదు అన్నారు. పాలక ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక ఆర్ధిక విధానాల మూలంగా ఇంటిపన్ను, నీటిపన్ను, కరెంటు బిల్లు, నిత్యావసర వస్తువు ధరలు అమాంతం పెరగిన పర్వావస్థానం, ఇంటి నిర్మాణ వ్యయం అమాంతం పెరగడం వాటి ప్రభావం ఇంటి బాడుగలు దినసరి కూలీకి పోయి జీవనం సాగిస్తున్న సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలు చెల్లించలేని స్థాయికి చేరుకున్నది అని ఆవేదన వ్యక్తం చేశారు. పోనీ సొంతంగా ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే ఒక జీవిత కాలం సరిపోవడం లేదు. జీవితంలో సొంతింటి కల నెరవేర్చుకోవాలన్న సంకల్పం సాకారం కాక అధికారులు, పాలక ప్రభుత్వాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా ఫలితం దక్కడంలేదు అన్నారు. గత ప్రభుత్వంలో ఇంటి స్థలం పక్కా గృహం మంజూరయ్యి కట్టుకొని లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం అమలు చేయాలన�