Sidebar


Welcome to Vizag Express
ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక‌లు సిద్దం చేయండి 15 శాతం వృద్దిరేటును సాధించాలి

03-02-2025 20:05:23

[5:03 PM, 2/3/2025] +91 80087 09765: విజయనగరం టౌన్, వైజాగ్ ఎక్సప్రెస్, జనవరి 3

ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక‌లు సిద్దం చేయండి
15 శాతం వృద్దిరేటును సాధించాలి
ప‌త్రిక‌ల్లో వార్త‌ల‌పై స్పందించాలి
జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్‌
                   ప్ర‌భుత్వ ప్రాధాన్య‌తా కార్య‌క్ర‌మాల అమ‌లు పై మూడు రోజుల్లో ప్ర‌గ‌తి నివేదిక‌ల‌ను త‌యారు చేయాల‌ని వివిధ శాఖ‌ల అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతిపై క‌లెక్ట‌రేట్లో సోమ‌వారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.  స్వ‌ర్ణాంధ్ర 2047 ల‌క్ష్యాల‌కు అనుగుణంగా 15 శాతం అభివృద్ది రేటు ఉండేలా ప్ర‌ణాళిక‌లను రూపొందించి అమ‌లు చేయాల‌ని ఆదేశించారు.

                   వివిధ కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లుకు ఏడాది ప్ర‌ణాళిక‌ల‌ను, ల‌క్ష్యాల‌ను త‌యారు చేయ‌డంపై అధికారుల‌కు క‌లెక్ట‌ర్ ప‌లు సూచ‌న‌లు చేశారు. వివిధ‌ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై స‌మీక్షిస్తూ, ప‌దిరోజుల్లో అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ప్ర‌గ‌తి క‌నిపించాల‌ని, మూడు నెల‌ల ప్ర‌ణాళిక‌ల‌ను సిద్దం చేయాల‌ని ఆదేశించారు. వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌, సూక్ష్మ సేద్య ప‌థ‌కాల‌పై స‌మీక్షిస్తూ, క్షేత్ర‌స్థాయిలో రైతుల‌ను చైత‌న్య ప‌ర‌చాల‌ని సూచించారు.ముఖ్యంగా బిందుతుంప‌ర్ల సేద్యం, ఉద్యాన సాగు పెంపు, ఆయిల్‌పాం, నాణ్య‌మైన మొక్క‌ల ఉత్ప‌త్తి, డ్రోన్ టెక్నాల‌జీ వినియోగంపై దృష్టి పెట్టాల‌ని సూచించారు. వీటిని నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల‌ని జెసి సేతుమాధ‌వ‌న్‌కు  సూచించారు. షెడ్యూల్ ప్ర‌కారం జ‌ర‌ప‌వ‌ల‌సిన శాఖాప‌ర‌మైన స‌మావేశాల‌ను నిర్ణీత వ్య‌వ‌ధిలోనే నిర్వ‌హించాల‌ని, లేదంటే దానికి ఆయా శాఖాధిప‌తులే బాధ్య‌త వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ స్పష్టం చేశారు.

ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన‌ వార్త‌ల‌పై స‌మీక్ష‌
                   వివిధ ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన సానుకూల‌, వ్య‌తిరేక వార్త‌ల‌పై ఈ స‌మావ
[5:09 PM, 2/3/2025] +91 80087 09765: విజయనగరం టౌన్, వైజాగ్ ఎక్సప్రెస్ జనవరి 3

తేదీ :08.03.2025న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి  ఆదేశాల మేరకు నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి  బి అప్పల స్వామి  అధ్యక్షతన సీనియర్ న్యాయ వాదులందరితో సమావేశమును ఏర్పాటు చేసిరి.
ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రత్యేకంగా పర్మనెంట్ ఇంజక్షన్ సంబంధించిన తగాదాలు ఎక్కువ సంఖ్యలో రాజి చేయాలని సీనియర్  న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సివిల్ తగాదాలు సత్వర పరిష్కారానికి ఈ జాతీయ లోక్ అదాలత్ ను వేదికగా ఎంచుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్  దేవీ రత్న కుమారి , అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి  బి రమ్య ,మొబైల్ కోర్ట్ జడ్జ్  పి బుజ్జి  ,మరియు సీనియర్ న్యాయవాదులు కె.వి తమ్మన శెట్టి ,  బొడ్డు సత్యనారాయణ , సిహెచ్ దామోదర్ రావు, బెల్లాన రవి, కె రవి బాబు, ఎల్ సత్యనారాయణ , మరియు  పి రాంబాబు  పాల్గొన్నారు.