Sidebar


Welcome to Vizag Express
రిజర్వేషన్ మద్యం షాపు నర్సీపట్నంలో ఏర్పాటు చేయాలి

03-02-2025 20:07:00

రిజర్వేషన్ మద్యం షాపు నర్సీపట్నంలో ఏర్పాటు చేయాలి:
నర్సీపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 3:
 ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ ప్రకారం, నర్సీపట్నం మండలంలో గీతకార్మికులకు మద్యం దుకాణాలు కేటాయించాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర దేవుడు డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆర్డిఓ కార్యాలయం వద్ద, తమ హక్కుల సాధన కోసం సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవుడు మాట్లాడుతూ, కల్లుగీత కార్మికులకు ఏడాదిలో మూడు నెలలే పని దొరుకుతుందని, మిగతా సమయం అంతా కార్మికులు ఖాళీగా ఉంటున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్యం పాలసీ ప్రకారం నర్సీపట్నంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ అధికారి వి.వి.రమణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బత్తిన నాగేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు తాతబాబు, లోవ తదితరులు పాల్గొన్నారు