Sidebar


Welcome to Vizag Express
బ్యాంక్ సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన

03-02-2025 20:08:16

బ్యాంక్  సేవలపై ప్రజలకు  విస్తృత అవగాహన

ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి,02: మండల పరిధిలో కర్రీ ముక్కిపుట్టు, మండిబ, బొడ్డగొంది, డేగలపుట్టు, పలు గ్రామాలతో సోమవారం నాబార్డ్ ఆర్థిక సహాయంతో భారతీయ స్టేట్ బ్యాంక్ విశాఖ రీజినల్ మేనేజర్ ఆదేశాల మేరకు ముంచంగిపుట్టు స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ కొర్ర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై ప్రజలకు రాజమహేంద్రవరం విభూతి బ్రదర్స్ కళా జాతర బృందంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాజాతర బృందం మెజీషియన్ మ్యాజిక్ షో వీధి నాటిక జానపద గీతాలు హాస్య అల్లరితో బ్యాంకు స్కీములపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించారు. ప్రైవేట్ బ్యాంకులను ఆశ్రయించరాదని ప్రభుత్వపరమైన బ్యాంకుల్ని ప్రతి ఒక్కరు ఆశ్రయించాలని ప్రభుత్వ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేసుకోవాలని అప్పుడే అధిక వడ్డీ వస్తుందన్నారు.అలాగే ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకం 436 రూపాయలు ప్రధానమంత్రి జీవనజ్యోతి,20 రూపాయలు ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్, వెయ్యి రూపాయలు ఎన్పీఎస్ వాత్సల్, వాత్సల్య పీఎం విశ్వకర్మ, లోను, విశ్వకర్మ ముద్ర రుణాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలు చేసే ఫోన్ కాళ్లపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలని కే సి సి రెవిన్యూల్ కోసం మనకు తెలియని వారికి బ్యాంకు సమాచారం తెలియపరచరాదని, అలాగే సైబర్ మోసానికి గురైనట్లయితే తక్షణమే, 1930 నెంబర్ కు ఫోన్ చేసి తెలియపరచాలన్నారు. రాజమండ్రి విభూతి బ్రదర్స్ తోపాటు ముంచంగిపుట్టు స్టేట్ బ్యాంక్ మెసెంజర్,  మహిళలు తదితరులు పాల్గొన్నారు.