ఓడి ఆర్ఎస్ఎఫ్ బృందంతో ముమ్మరంగా గాలింపు చర్యలు
03-02-2025 20:10:04
ఓడి ఆర్ఎస్ఎఫ్ బృందంతో ముమ్మరంగా గాలింపు చర్యలు
లభ్యం కానీ విద్యార్థుల ఆచూకీ
ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి,02: అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం జోలపుట్టు ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం జలాశయంలో శనివారం నాటు పడవ సహాయంతో శివ, అమిత్ కుమార్, గౌతమ్ లు ముగ్గురు విద్యార్థులు, రీల్స్ కోసం సెల్ఫీలు వీడియోలు తీసుకునే క్రమంలో ప్రమాదవసత్తు నాటు పడవ మునిగి ముగ్గురు విద్యార్థులు జలాశయంలో పడిపోగా గౌతమ్ అనే విద్యార్థి ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్నారు. మిగతా ఇద్దరు శివ అమిత్ కుమార్ లు జలాశయంలో గల్లంతయ్యారు. దీంతో శనివారం సాయంత్రం నుండి, ఆది, సోమవారం ఓడి ఆర్ ఏ ఎఫ్ బృందం, అగ్నిమాపక బృందంతో, మూడు రోజులుగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన విద్యార్థుల ఆచూకీ లభ్యం కాలేదు. ఓఆర్ డిఏఎఫ్ బృందం జలాశయంలో గాలింపు చర్యలు చేపడుతుండడంతో మునిగిన పడవను వెలికి తీశారు. సోమవారం చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. మంగళవారం ఉదయం మళ్లీ యధావిధిగా గాలింపు చర్యలు చేపడతామని సహాయక బృందాలు తెలిపారు. మూడు రోజులుగా తమ పిల్లల ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లితండ్రులు నిరాశగా కన్నీరు మున్నీరుగా వెనుతిరుగారు. పొట్టంగి నియోజకవర్గం ఎమ్మెల్యే సీఎల్పీ నేత రామ్ చందర్ కడం, ఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గల్లంతైన వారికి ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయలు, చొప్పున ప్రభుత్వం అందిస్తుందన్నారు. కుటుంబానికి ఇందిరమ్మ అవాస యోజన పథకం ద్వారా గృహాలు మంజూరు చేస్తామని కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఓ డి ఆర్ ఎస్ ఎఫ్, అగ్నిమాపక బృందాలు చేపడుతున్న సహాయక చర్యల్లో నందాపూర్ బ్లాక్ డి.ఎస్.పి సవింద్ కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. సహాయ చర్యలు ముమ్మరంగా చేయాలని బృందాలను ఆయన కోరారు. ముంచింగిపుట్టు మండల తహసిల్దార్ నర్సమ్మ, ఎంఆర్ఐ రవికుమార్, సిబ్బందితో సంఘటనలో మూడు రోజులగా చేపడుతున్న సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం అయిన గల్లంతయిన వారి ఆచూకీ లభ్య మవుతుందని తల్లితండ్రులు స్థానికులు, కుటుంబ సభ్యులు భావించిన వారి ఆచూకీ లభ్యం కాకపోవటంతో నిరాశగా కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్ డి ఆర్ ఎఫ్ ఇండియన్ నేవీ సహాయం తీసుకుని గల్లంతైన విద్యార్థుల ఆచూకీ తెలుసుకోవాలని తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు కోరారు.