*రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు
*ప్రధమ స్థానంలో నిలిచిన విజయనగరం జిల్లా
శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి,3:
రథసప్తమి వేడుకల్లో భాగంగా ఎన్.టి.ఆర్. మున్సిపల్ మైదానంలో 2, 3 తేదీలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. గుంటూరు, కడప, చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరి, విజయనగరం, కృష్ణా, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనంతపురం, శ్రీకాకుళం-ఎ, శ్రీకాకుళం-బి జిల్లాలు నుండి పాల్గొన్నారు. సోమవారం నిర్వహించిన ఫైనల్స్ లో గెలుపొందిన విజయనగరం టీం మొదటి బహుమతి రూ.50 వేలు, శ్రీకాకుళం టీం రెండవ బహుమతి రూ.30 వేలు, కృష్ణా జిల్లాకు మూడవ బహుమతి రూ.20 వేలు అందజేశారు. ఫెనల్ మ్యాచ్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి తిలకించారు. ఈ కార్యక్రమంలో డిఎస్డీఓ శ్రీధర్, కార్యదర్శి పెంకి సుందరరావు, కోచ్ లు, తదితరులు పాల్గొన్నారు.