Sidebar


Welcome to Vizag Express
గురువుల ప్రబోధాలే శిరోధార్యం

03-02-2025 20:20:34

గురువుల ప్రబోధాలే శిరోధార్యం 
                             పొందూరు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫబ్రవరి 3:

గురువుల ప్రబోధాలు శిరోధార్యమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యాళాల శ్రీనివాసరావు హితవు పలికారు.శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి వారే దేవతలను శరణువేడిన ఉదంతాలను గుర్తు చేసుకోవాలన్నారు లయి
లైదాంలోని శివానంద ధర్మక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన భక్త సత్సంగ మాధురి కార్యక్రమంలో శ్రీనివాసరావు పాల్గొని మార్గదర్శనం చేశారు. స్వామి రామయోగి  దివ్య ఆశీస్సులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో  జ్యోతి స్వామి, ఆశ్రమ కమిటీ అధ్యక్షులు గొర్లె అనంతరామ,త్రివటవృక్ష జ్యోతిస్వామి,మామిడిపల్లి ఈశ్వర్ రావు,బలివాడ వేంకటేశ్వర్లు,రాజు తదితరులు పాల్గొని మాట్లాడారు.పొందూరు,జి.సిగడాం, లావేరు, సంతకవిటి తదితర మండలాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.చివరిగా అన్నసమారాధన జరిగింది.