Sidebar


Welcome to Vizag Express
అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని జనసేన నిరసన

03-02-2025 20:26:53

అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని జనసేన నిరసన 

ఇచ్ఛాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 3


 ఇచ్చాపురం నుండి కొలిగాం వెళ్లే మార్గంలో రైల్వే అండర్ పాస్ లేకపోవడం వలన ఆ మార్గంలో నిత్యం ప్రయాణించే ప్రజలు వాహనదారులు విద్యార్థులు చుట్టుప్రక్కల సుమారు 30 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరి రాజు రైల్వే అధికారులకు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రైల్వే ఎల్ సి గేట్ వద్ద జనసైనికులు, విద్యార్థులు, ఆటో, టాక్సీ యూనియన్ సభ్యులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ప్రతి 20 నిమిషాలకు గేటు పడటం వలన అత్యవసర సమయాల్లో రోగులు ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండర్ పాసింగ్ కావాలని ఎన్నోసార్లు రైల్వే అధికారులకు వినతిపత్రం అందజేసిన అధికారులు పట్టించుకోకపోవడంతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాల్సి వచ్చిందని అన్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎల్ సి గేట్ వద్ద విద్యార్థులతో నిరసనలు చేపట్టారు. అనంతరం జిఎం పరమేశ్వరన్ పక్వాల్ ను కలిసి వినతి పత్రాలు అందజేసి అండర్ పాస్ లేకపోవడంతో ప్రజలు పడుతున్న అనేక ఇబ్బందులకు గూర్చి వివరించారు. సమస్యలు విన్న జీఎం 100% నిర్మాణానికి అవకాశం ఉంటే పరిశీలించటం జరుగుతుంది ప్రస్తుతం ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరుగుతుందని దీంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతుందని అన్నారు. అనంతరం జిఎం కు రాజు సాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ భారతి, ఆదిత్య, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సత్యసాయి పాఠశాల విద్యార్థులు, జన సైనికులు పాల్గొన్నారు