పలాస రైల్వే స్టేషన్ సమస్యల పరిష్కరించండి
రైల్వే జిఎం పరమేశ్వర్ పంక్వాల్ కు ఎమ్మెల్యే
శిరీషా వినతి
సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ప్రెస్ ,పిబ్రవరి 2:
పలాస రైల్వే స్టేషన్ లో నెలకొన్న సమస్యలతో పాటు ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి ఇబ్బందులు తొలగించాలని ,అలాగే
మందస , పూండి రైల్వే స్టేషన్లో పలు రైళ్లు ను నిలపాలని.రైల్వే జిఎం పరమేశ్వర్ పంక్వాల్ కు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషా విజ్ఞప్తి చేశారు. సోమవారం స్టేషన్ పరిశీలనకు వచ్చిన ఆయన్ని ఎమ్మెల్యే కలిసి ఇక్కడ సమస్యలు వివరించారు.హౌరా చెనై, విశాఖ ఎక్స్ప్రెస్, బరంపురం విశాఖపట్నం రైలు లను మందస,పూండి లో నిలపాలని.పూరి తిరుపతి రైలు పూండి లో నిలపాలని.బారువ రైల్వే స్టేషన్ లో పలు ప్యాసింజర్ ,ఎక్స్ ప్రెస్ రైళ్లకు స్టాపేజ్ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎపిటిపి చైర్మన్ వజ్జ బాబురావు, పీరుకట్ల విఠల్ , పుచ్చ ఈశ్వరరావు, లోడగల కామేశ్వరరావు, సవర రాంబాబు, చంద్రశేఖర్ త్యాడి, సార నోములు తదితరులు పాల్గొన్నారు.