తండేల్ సినిమాను ఆదరించండి
మత్స్యకారులకు ఎస్టీ సాధన సమితి పిలుపు
సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ప్రెస్ ,పిబ్రవరి 2:
అల్లు అరవింద్ సమర్పణలో ,బన్నీ వాసు నిర్మాతగా ,అక్కినేని నాగచైతన్య ,సాయిపల్లవి ,నటించిన తండేల్ చిత్రం ఈనెల 7 న విడుదల అవుతున్న నేపథ్యంలో జిల్లాలో ఉన్న మత్స్యకారులు అంతా ఈ సినిమా తప్పనిసరిగా చూసి ఆదరించాలని మత్స్యకారులు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు, చింతపల్లి సూర్యనారాయణ, న్యాయవాది. గుంటు శ్రీనివాసరావు , జిల్లా అధ్యక్షులు. మైలపల్లి పోలీసు, ప్రధాన కార్యదర్శి, న్యాయవాది. ఇద్దు పాపయ్య మాష్టర్ , న్యాయవాది,ప్రధాన కార్యదర్శి, . మైలపల్లి పోలీసు, సొసైటీ ప్రెసిడెంట్,గుండాల గణేష్ కుమార్, న్యాయవాది, ఉపాధ్యక్షులు, కొండా సింహాచలం ,ఉపాధ్యక్షలు. కొమర మున్నా, కార్యదర్శి, న్యాయవాది, సూరాడ లక్ష్మణ , కార్యదర్శి, మైలపల్లి గోపి తదితరులు కోరారు .ఈ మేరకు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ సంధర్భంగా ఈ చిత్రానికి మూల కారణం అయిన కె మత్స్యలేసం గ్రామానికి చెందిన మత్స్యకారులకు ఈవెంట్స్ లో అవకాశం కల్పించడం ఆనందంగా ఉందని అన్నారు.థియేటర్లు కు వెళ్లి సినిమా చూసి మరో పదిమంది చూసేలా ప్రోత్సాహించాలని అన్నారు. మత్స్యకారుల జీవన పరిస్థితులు తెలుసుకుని నెలరోజుల పాటు వారితో సావాసం చేసి మనతో మమేకమై ఈ చిత్రంలో నాగచైతన్య నటించడం మన సామాజిక వర్గానికే గర్వంగా ఉందని అన్నారు