Sidebar


Welcome to Vizag Express
సైబర్ సెల్, ఐటి కోర్ టీం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎస్పీ

03-02-2025 20:34:28

సైబర్ సెల్, ఐటి కోర్ టీం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎస్పీ 
పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 3:
  పార్వతీపురం మన్యం జిల్లాలో  సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సైబర్ సెల్, ఐటి కోర్ టీం అధికారులు, సిబ్బంది పనితీరుపై జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి, ఐపిఎస్   సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ  ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయని, వీటి వలన ప్రజలు కష్టబడి సంపాదించుకున్న నగదు గుర్తుతెలియని వ్యక్తులు దోచుకుంటున్నారని అందువల్ల సైబరు మోసాలు జరగకుండా ప్రజలకు సైబరు మోసాలు పట్ల అవగాహన కల్పించి , సైబరు మోసానికి గురైతే 1930 కు లేదా సైబరు క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు నమోదు అయ్యే విధంగా ప్రజలలో చైతన్యం తీసుకురావాలని అధికారులని ఆదేశించారు. బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ అయిన నగదు బాధితులకు అందే విధంగా తగు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. అదే విదంగా  కాలానుగుణంగా మనము కూడా టెక్నాలజీ మీద పరిణితి చెందాలని సూచించారు. అందుకు అనుగుణంగా  పోలీస్ సిబ్బంది అందరికి సైబర్ నేరాల సాంకేతికతపై ప్రతి శనివారం శిక్షణా తరగతులు నిర్వహించాలని సైబర్ సెల్, ఐటి కోర్ టీం అధికారులు,సిబ్బందికి జిల్లా ఎస్పీ ఆదేశిస్తూ,పలు సూచనలు, సలహాలు చేశారు. 

ఈ సమావేశంలో సోషల్ మీడియా, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు , ఎస్సై  రవీంద్ర రాజు, సైబర్ సెల్, ఐటి కోర్ టీం సిబ్బంది పాల్గొన్నారు.