Sidebar


Welcome to Vizag Express
అధిష్టానం మద్దతిచ్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకుందాం మంత్రి సంధ్యారాణి

03-02-2025 20:35:36

అధిష్టానం మద్దతిచ్చిన  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకుందాం
 మంత్రి సంధ్యారాణి
పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 3:
మంచి సమాజాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి  సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం లోని సాయిస్ ప్యాలస్ లో ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధ త సమీక్ష  కార్యక్రమం నిర్వహించారు .  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను కాపలా వుంచి అవమానపరిచిన వైకాపా ప్రభుత్వ తీరును ప్రతి ఉపాధ్యాయులు గుర్తుంచుకోవాలని మంత్రి అన్నారు. ఉపాధ్యాయులకు చెల్లించవలసిన బకాయిలను చెల్లించకుండా జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయ ఉద్యోగులను ఎంతో ఇబ్బంది పెట్టారని వాటిని ఉపాధ్యాయులు గుర్తు చేసుకోవాలని ఆమె అన్నారు. ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర చాలా కీలకమని అటువంటి ఉపాధ్యాయులపై కూటమి ప్రభుత్వానికి మంచి గౌరవభావం ఉందిన్నారు. తెలుగుదేశం, భాజపా జనసేన శ్రేణులు అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని ఆయన సూచించారు. అధిష్టానం సూచనలు మేరకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తామని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటు అధ్యక్షులు శ్రావణ్ కుమార్, కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి, బిజెపి జిల్లా అధ్యక్షులు  ద్వారపు రెడ్డి  శ్రీనివాసరావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వీరేష్ దేవ్,జనసేన నాయకులుబాబు పాలూరి, టిడిపి నాయకులు కొప్పల వెలమ డైరెక్టర్ గొట్టాపు వెంకట నాయుడు, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ శనపతి శేఖరపాత్రుడు, దత్తి లక్ష్మణరావు, డొంకాడ రామకృష్ణ,బార్నాల సీతారాం, పెంకి వేణుగోపాల్ నాయుడు, రౌతు వేణు, బోను చంటి, గుండ్రెడ్డి రవికుమార్, లక్ష్మణరావు, బడే గౌరునాయుడు , కోల మధు, నంగి రెడ్డి మధు,అక్కెనశివ, రెడ్డి శివ,  తదితరులు పాల్గొన్నారు.