ఐ టీ బకాయిలు ఇప్పంచండి..
జోనల్ కమిషనర్ కు వినతి పత్రం.
మధురవాడ,వైజాగ్ ఎక్స్ప్రెస్:
మున్సిపల్ పారిశుధ్య కార్మికుల జీతాల నుండీ 2016 నుండి 2020 వరకు వసూలు చేసిన ఆదాయపన్ను వెనక్కి ఇవ్వాలని కోరుతూ జీ వి ఎం సి జోన్ 2 కమిషనర్ ఫనిరాం కు వినతి పత్రం అందజేశారు. జీ వి ఎం సి లో ప్రజారోగ్య విభాగం లో ఔట్ సోర్సింగ్ కార్మికులకు 2016 లో ఎస్ ఎల్ ఎఫ్ ద్వారా జీతాలు ఇచ్చేవారని,ఆ కాలంలో 5 సంవత్సరాలు ఆదాయపు పన్ను ఎస్ ఎల్ ఎఫ్ నుండి కటింగ్ చేశారని తెలియ చేసారు.సి ఐ టీ యు ఆధ్వర్యంలో పన్ను వసూలు చేయడం చట్టవిరుద్ధమైనధని పోరాటం చేశారని తెలియ చేసారు.అనంతరం ఆదాయపన్ను శాఖ నుండి, కార్మికుల నుండి వసూలు చేసిన పన్ను తిరి కార్మికులకు చెల్లించారని తెలియచేసారు.
కానీ జోన్ 2 పరిది లో పని చేస్తున్న కార్మికులకు ఇంత వరకు డబ్బులు ఇప్పంచలేదని తెలియ చేసారు.సాంకేతిక సమస్యలుంటే వెంటనే పరిష్కారం చేసీ కార్మికుల బ్యాంక్ ఖాతాలకు ఆదాయపు పన్ను మొత్తాన్ని జమ చేయాలని డిమాండ్ చేశారు.
జోనల్ కమిషనర్ ను కలిసిన వారిలో సి ఐ టీ యు నాయకులు డీ అప్పలరాజు,ఎం వి ప్రసాద్,సి హెచ్ శేషు బాబు, ఎస్ రామప్పాడు,కే నాగరాజు,కే ఈశ్వరరావు,జీ కిరణ్,బి అప్పారావు,డీ సూరిబాబు,తదితరులు పాల్గొన్నారు.