మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య
భీమిలి,రూరల్ వైజాగ్ ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి 3:
భీమిలి మండలం చేపలుప్పాడ గ్రామం కొత్తూరు ప్రాంతానికి చెందిన ఉమ్మిడి.నరేంద్ర(29) మనస్థాపంతో ఇంట్లో ఉరి వేసుకునే ఆత్మహత్య చేసుకున్నాడు.వివరాల్లోకి వెళితే...చేపలుప్పాడ గ్రామం కొత్తూరు ప్రాంతానికి చెందిన ఉమ్మిడి.నరేంద్రకు తాటితూరు గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో 9 నెలల క్రితం వివాహం జరిగింది.ఈ నేపథ్యంలో పుట్టింటికి వెళ్ళిన ఆమె నెలలు గడిచిన కాపురానికి రాకపోవడంతో మనస్థాపం చెందాడు.దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు.స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.