స్వచ్ఛంద సంస్థల సహకారంతో నూతన పాఠశాల భవనం ప్రారంభం
ఆనందపురం, వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్ ఫిబ్రవరి 3.
ఆనందపురం మండలంలోని గంభీరం
లో స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాఠశాల భవనం ప్రారంభించారు.
విశాఖపట్నం రౌండ్ టేబుల్ స్వచ్ఛంద సంస్థ
గంభీరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 4 గదుల పాఠశాల భవనం 50 లక్షల వ్యయంతో నిర్మించారు. కేశవ మజ్జి, అనికేతవర్మ, మురళి గన్నమని దాతలు, రౌండ్ టేబుల్ సభ్యులు మొత్తం 50 లక్షల వ్యయంతో ఈ భవనం నిర్మించారు. పాఠశాలకు కావలసిన మిగిలిన వసతులు కూడా సమకూరుస్తామని చెప్పారు. ముఖ్యఅతిథిగా వచ్చిన కేసి వెంకటేశ్వర్లు చక్కని భవనం సమకూర్చినందుకు పెద్ద సంఖ్యలో పిల్లల్ని చేర్చుకోవాలని, ఉపాధ్యాయులు కష్టపడి మరింత అభివృద్ధిలోకి పాఠశాలను తీసుకురావాలని కోరారు. ప్రధానోపాధ్యాయుడు
యు వి వి ప్రసాద్ అన్ని సౌకర్యాలతో భవనం నిర్మించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారిని జానకి, విద్యాశాఖ అధికారులు వి. జోగీందర్ నాథ్, గంగరాజు, రౌండ్ టేబుల్ సభ్యులు అభిషేక్, చైతన్య, అమిత్ చౌదరి, మక్సుద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.