Sidebar


Welcome to Vizag Express
వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ పదవికి రాజీనామా... భాగం

03-02-2025 20:46:08

వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ పదవికి రాజీనామా... భాగం

భీమిలి, రూరల్  వైజాగ్ ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి 3:
 గత పది సంవత్సరాలుగా భీమిలి నియోజకవర్గంలో వైసిపి పార్టీ బలోపేతనకై అహర్నిశలు కష్టపడిన భాగం సుధాకర్ నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు.సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...వైసిపి పార్టీ ఆవిర్భావం నుండి భీమిలి నియోజకవర్గంలో అనేక కష్టాలు అనుభవించి పార్టీకి వెన్నుముకగా కష్టపడ్డానని అన్నారు.2019 ఎన్నికలలో సోషల్ మీడియా కన్వీనర్ గా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిపించడంలో కీలక పాత్ర పోషించనని వివరించారు.అనేక వ్యక్తిగత కారణాలవల్ల నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.ఇకపై వైసీపీ పార్టీకి సామాన్య కార్యకర్తల పనిచేస్తానని పేర్కొన్నారు.ఇది నా వ్యక్తిగత నిర్ణయమే తప్ప ఎవరు ప్రేరేపించింది కాదన్నారు. తన రాజీనామ పత్రాన్ని అధిష్టానానికి పంపించానన్నారు.