Sidebar


Welcome to Vizag Express
ఐటిడిఏ పి ఓ గా బాధ్యతలు స్వీకరించిన జెసి

03-02-2025 20:48:45

ఐటిడిఏ పి ఓ గా బాధ్యతలు స్వీకరించిన జెసి 

పాడేరు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 3 : ఐటిడి ఏ పి ఓ గా పూర్తి అదనపు బాధ్యతలను జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషక్ గౌడ (2020 ఐ ఎ ఎస్) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వెళుతున్న పి. ఓ. వి. అభిషేక్ ఉదయం పి. ఓ. బాధ్యతలు నుండి రిలీవ్ అయ్యారు. డా. అభిషేక్ గౌడ 2024 జూలై 22 నుండి జాయింట్ కలెక్టర్ గా  విధులు నిర్వహిస్తున్నారు. నూతన పి.ఓ. గా బాధ్యతలు స్వీకరించిన డా. ఎం. జె. అభిషేక్ గౌడకు ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారులు వి. ఎస్. ప్రభాకర రావు, ఎం. వేంకటేశ్వరరావు, పరిపాలనాధికారి ఎం. హేమలత, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎల్.రజని, డి. ఆర్.డి.ఏ. పి.డి.వి. మురళి, గురుకులం ప్రిన్సిపాల్ పి. ఎస్. ఎన్. మూర్తి, గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇ జి. డేవిడ్ రాజు, ఎ. ఇ. దుర్గా ప్రసాద్ జేసారు. తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.