Sidebar


Welcome to Vizag Express
రెవిన్యూ సదస్సులలో వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలకు పరిష్కారం జరిగేదెప్పుడు?

03-02-2025 20:52:22

రెవిన్యూ సదస్సులలో వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలకు పరిష్కారం జరిగేదెప్పుడు?
 రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తున్న 
 సిపిఎం నాయకుడు కొల్లి సాంబమూర్తి.
కొమరాడ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 3:
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భూములు సరిచేయాలని కోరుతూ రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులతో కలిసి పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ పత్రిక ప్రకటనలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ
గత వైయస్సార్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భూమున్న రైతులందరకు అన్ని విధాలుగా భూముల సమస్యపై భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా భరోసా కల్పిస్తామని పేరుతో భూములను రి సర్వే చేయించడం జరిగిందని అయితే ఈ రీ సర్వేలో ఎక్కువగా భూమి ఒకరి పేరు ఉంటే వేరే వారి పేరు నమోదయిందని అలాగే  అలాగే ఆధార్ కార్డు నెంబర్ ఫోన్ నెంబర్ నెంబర్ ఖాతా నెంబర్ తప్పుగా నమోదయ్య పరిస్థితి ఉందని మరియు చనిపోయిన వాళ్ళ పేరుమీద కూడా భూములు అక్కడక్కడ రీ సర్వేలో పేర్లు రికార్డులలో నమోదు అయ్యే పరిస్థితి ఉందని మరియు  అలాగే భూమి తక్కువ ఉన్న రైతు పేరున ఎక్కువ భూమి రికార్డులు పేర్లు నమోదయ్యే పరిస్థితి ఉందని అలాగే ఎక్కువగా భూమి ఉన్న రైతు పేరున తక్కువ భూమి ఉన్నట్లుగా రికార్డుల పేరు నమోదు అయిందని అలాగే ఎవరైతే తమ భూమి గతంలో అమ్మేశా రో అమ్మినవారికి వాళ్ళకి తెలియకుండా అమ్మినవారే మళ్లీ రీ సర్వేలో తన యొక్క పేర్లు కూడా నమోదచేసుకునే పరిస్థితి ఉందని ఇది చాలా అన్యాయమని ఇలా గతంలో చేసిన రీసర్వే లో తప్పుడు తడకలుగా అన్ని విధాలుగా నమోదయ్యే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో రీ సర్వే పేరుతో కోట్లాది డబ్బులు ఖర్చు పెట్టడంతో పాటు రాళ్లు పొలాల్లో పాతిన పరిస్థితి ఉంది అయితే రీ సర్వే అంతా   తప్పుడు తడకలుగా ఉండటంతో ఆరు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూట మీ ప్రభుత్వం రైతుల యొక్క భూములు సమస్యలను సరి చేయడంతో పాటు అన్ని విధాలుగా పరిష్కరించే దిశగా రాష్ట్రవ్యాప్తంగా తేదీ 6 /12/ 2024 నుండి తేదీ 8/1/ 2025 వరకు సుమారు నెలరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించిన సందర్భంగా కొమరాడ మండలంలో కూడా రెవెన్యూ సదస్సుల పేరుతో రైతుల యొక్క భూ సమస్యలను పరిష్కారం చేయాలను కోరుతూ సుమారు 1450 మంది వరకు రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు చేసుకోక వాళ్ళు కు దరఖాస్తు చేసుకున్నట్లుగా రసీదు కూడా రెవిన్యూ శాఖ అధికారులు ఇవ్వడం జరిగిందని అయితే ఇలాంటి సందర్భంలో నెలలు గడుస్తున్న దరఖాస్తు చేసుకున్న రైతుల యొక్క భూ సమస్యలు పరిష్కారం ఎక్కడ జరిగిన పరిస్థితి ఉందని మరి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని మా దృష్టికి వచ్చిందని కాబట్టి వెంటనే ఎవరైతే రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు చేసుకున్నా రో వారి యొక్క భూ సమస్య వెంటనే  పరిష్కరించే దిశగా అటు రాష్ట్ర ప్రభుత్వం మరియు రెవెన్యూ శాఖ అధికారులు ఆలోచించాలని లేనియెడల ఈ ప్పటికీ ఎవరైతే భూమి కోసం రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకున్నారో రాబోయే రోజుల్లో వాళ్ళందర్నీ కూడగట్టి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీగా ఆందోళన చేస్తామన్నారు.